Preminthunu ninne Telugu Christian song Lyrics

            Preminthunu ninne

ప్రేమింతును నిన్నే – జీవింతును నీకై

ధ్యానింతును నిన్నే – ప్రకటింతును నీకై

యేసూ… నీవే…

అతి సుందరుడా – అతి శ్రేష్టుడా

నీవే… అతి కాంక్షనీయుడా

నా ప్రాణ ప్రియుడా – నా యేసయ్యా       ||ప్రేమింతును||

నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా

ప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా (2)

నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు

నా జీవిత కాలమంతా నిన్నే కీర్తింతునయ్యా (2)        ||యేసూ||

నీ ముఖము అతి మనోహరం సూర్య కాంతి మించినది

నీ స్వరము అతి మధురం తేనె కంటె తీయనిది(2)

షాలేము రాజా సమాధాన కర్తా

రక్షణ పాత్ర చేత బూని ఆరాధింతునయ్యా (2)        ||యేసూ||

Comments

Popular posts from this blog

Naa thandri ninnu chala badha pettanu Telugu Christian song Lyrics

Prema yesayya prema Telugu Christian song Lyrics